తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు
సిరా న్యూస్,కౌతాళం;
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం.కార్యకర్తల సంక్షేమము మరియు ఆర్థిక స్థితిగతుల దృష్టిలో పెట్టుకొని మేలు చేకూరే విధంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త ప్రమాద ఆవశత్తూ మరణిస్తే 5 లక్షల భీమా, ఆకాల మరణం చెందితే 10వేల మట్టి ఖర్చులకు మరియు కుటుంబానికి ఉపాధి అవకాశాలు మరియు కుటుంబానికి విద్య,వైద్య సహాయ సహకారాలు అందచేస్తు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. కావున ప్రతి కార్యకర్త సభ్యత్వం తీసుకుంటూ,తమ బంధువులను, స్నేహితులను మరియు మన చుట్టూ ఉన్న వాళ్ళను సభ్యత్వం తీసుకునే విధంగా మన వంతుగా కృషి చెయ్యాలని కోరారు.ప్రతి ఒక్క కార్యకర్త ఒక సవాలుగా స్వీకరించి జిల్లాలోనే అత్యధిక సభ్యత్వ నమోదులు చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమములో తెదేపా సీనియర్ నాయకులు ,అడివప్ప గౌడ్,వెంకటపతి రాజు,సౌద్రి బసవరాజు, గురు రాజు స్వామి,టిప్పు సుల్తాన్, రామలింగన్న,కురువ వీరేశ్, పట్టాభి, మరియు యువ *నాయకులు సతీష్ నాయుడు ,సురేష్ నాయుడు గారు ,చంద్రన్న, తిక్కయ్య, రంగస్వామీ, రాజనందు శంకర్,నరసన్న,బసవరాజు,దొడ్డన్న గౌడ్,నరసింహులు,భాషా, డేవిడ్, వీరేష్,నరసింహులు మొదలగు తెలుగు యువత,కార్యకర్తలు పాల్గొన్నారు.