సిరాన్యూస్,ఓదెల
పొద్దుతిరుగుడు విత్తనాలు పంపిణీ : మండల వ్యవసాయ అధికారి బి.భాస్కర్
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం పూర్తి రాయితీ పై సబ్సిడీ పొద్దుతిరుగుడు విత్తనాలను రైతులకు మండల వ్యవసాయ అధికారి బి భాస్కర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వంట నూనెల పై డిమాండ్ దృష్ట్యా రైతు సోదరులు నూనె గింజల పంటలు సాగు చేసినట్లు అయితే అధిక ఆదాయం పొందవచ్చు అన్నారు. నీరు నిల్వనీ తటస్థ నేలలు అయిన ఎర్ర , చల్క, రేగడి నేలలు అనుకూలమని తెలిపారు. ఈ హైబ్రిడ్ వానాకాలం యాసంగి సీజన్ లో విత్తు కోవచ్చు అని తెలిపారు. యాసంగి లో అక్టోబర్ నవంబర్ మాసలలో విత్తుకోవచ్చు తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరింత సమాచారం కోసం రైతులు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సంధ్య, రైతులు ఉన్నారు.