కోహెడ మండలం శనిగరం రిజర్వాయర్ లో 100 శాతం రాయితీ పై ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం

సిరా న్యూస్,కోహెడ;

ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
శనిగరం ప్రాజెక్ట్ లో పూజలు చేసి చేప పిల్లలు మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. . సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి.
కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట కాంగ్రెస్ ఇంచార్జి పూజల హరికృష్ణ,శంకర్ రాథోడ్ రాష్ట్ర మత్స్య శాఖ అడిషనల్ డెరైక్టర్ , సిద్దిపేట ఫిషరీస్ అధికారులు, ఈఎన్సి, సిద్ధిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో, నియోజకవర్గ ముఖ్య నేతలు, అధికారులు
మంత్రి పొన్నం ప్రభాకర్:
శనిగరం ప్రాజెక్ట్ లో చేప పిల్లల విడుదల చేయడం జరిగింది
కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు మరింత న్యాయం చేయాలని ఆర్థికంగా ఎదగాలని చేప పిల్లల పంపిణీ గతానికి మించి చేస్తున్నాం.
గతంలో చేప పిల్లల పంపిణీ చేయడానికి పాత పేమెంట్ కొంత ఇబ్బంది పడ్డారు అవి క్లియర్ చేస్తాం.
చేప పిల్లల పంపిణీ దిగ్విజయంగా పూర్తి చేయాలి.
గంగపుత్ర ముదిరాజ్ ఆర్థికంగా ఎదగడానికి ఇది కుల వృత్తి
సిద్దిపేట జిల్లాలో మత్స్య సహకార సంఘాలు ఉన్నవాటికి పరిమితం కాకుండా నీటి నిల్వలు ఉన్న దగ్గర కూడా చేప పిల్లలు విడుదల చేయాలని కలెక్టర్ ను కోరుతున్న.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి చెరువులో చేప పిల్లలు విడుదల చేసుకునే బాధ్యత మీదే.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి కుల వృత్తులు మారాలి.
మత్స్య శాఖ కు సంబంధించి మొబైల్ మార్కెట్ లు అమ్ముకోవడానికి మౌలిక వసతులు తదితర వాటిపై చర్యలు తీసుకుంటాం.
హుస్నాబాద్ నియోజకవర్గంలో శనిగరం దగ్గర ప్రభుత్వ స్థలంలో ఫిష్ మార్కెట్ పెడతాం. ఆర్డీవో గారు స్థల సేకరణ చేయాలి
హైదరాబాద్ కి పోయే వారు ఇక్కడ చేపలు కొనుక్కొని పోయేలా అభివృద్ధి జరగాలి.
శనిగరం గెస్ట్ హౌజ్ పునరుద్ధరణ చేస్తాం
ఇక్కడ టూరిజం అభివృద్ధి చేస్తాం.
ఫిష్ పాండ్ ను పునరుద్ధరణ చేయాలి దానిని ఆక్టివ్ చేయాలి.
మత్స్య సంపద,పశు పోషణ పాలు, కోళ్ళు పై ఎక్కువ దృష్టి సారించాలి.
ఆయిల్ ఫాం, డ్రాగన్ ఫ్రూట్ చేపల చెరువు ,కోళ్ళు పెంపకం, అవులు గేదెల పెంపకం పై రైతు వేదికల వద్ద అవగాహన కల్పిస్తున్నాం.
బ్యాంకర్ల తో కూడా మీటింగ్ లు పెట్టీ లోన్లకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ద్వారా కుల వృత్తుల ద్వారా మోడీపికేశన్ ట్రైనింగ్ ఇచ్చి మారుతున్న కాలానికి అనుగుణంగా మారేలా శిక్షణ ఇస్తాం
కాలువల ద్వారా ప్రతి గ్రామంలో నీళ్ళు అందిస్తాం. అది అందరి ఆకాంక్ష.
రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించిన తరువాత గత ప్రభుత్వం లో జాప్యం జరిగింది.
ఇప్పుడు ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేస్తాం. కాలువల నిర్మాణం పూర్తి చేస్తాం.
డబుల్ రోడ్లు పూర్తి అయిన దగ్గర అవెన్యూ ప్లాంటేషన్ కింద ఇరువైపులా చెట్లు నాటలి.
విదేశాల్లో మంచిగా లక్షల్లో జితాలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ వీసా ఇచ్చి పంపించే కార్యక్రమం చేపడతాం
త్వరలోనే టాంకాం ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేపడతాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *