విజయమ్మ ఈ గొడవలను ఆపాలి

బాలినేని
సిరా న్యూస్,హైదరాబాద్;
మాదాపూర్ తన నివాసంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆస్తుల విషయంలో జగన్, షర్మిల బహిరంగ లేఖలతో రోడ్డేక్కారు. నేను జనసేనాలోకి వచ్చినా, నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి.40 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి హుందాగా రాజకీయాలు చేసారు. మేము ఆర్థికంగా బలపడ్డాము అంటే కారణం విజయమ్మ. చంద్రబాబు, కూటమి చేస్తుంది అనడం కరెక్ట్ కాదు..మాకు ఏం అవసరం. కుటుంబ తగాదాని కూటమి కి అంటగడుతున్నారని ఆరోపించారు. విజయమ్మ ఈ గొడవలకి పుల్ స్టాప్ పెట్టాలి. విజయమ్మ నే జడ్జిమెంట్ ఇవ్వాలి.రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఆస్తుల కోసం రోడ్ ఎక్కడం బాధగా ఉంది. ఆడబిడ్డ కంట తడి పెట్టడం మంచిది కాదు. వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి పెద్ద మనషులుగా సర్దుబాటు చేయాలి. సమస్యను జటిలం చేసి వైఎస్ కుటుంబం పరువును బజారుకీడుస్తున్నారు.
షర్మిల, జగన్ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. నేను వైసీపీ లో ఆస్తులు సంపాదించుకొని జనసేన లోకి వెళ్లాను అని ప్రచారం చేస్తున్నారు. నేను వైసీపీ లో ఆస్తులు పోగొట్టుకున్నాను తప్ప సంపాదించుకోలేదు.. ఇది జగన్ కి కూడా తెలుసు. నేను ఆస్తులు అమ్ముకున్నాను. నన్ను ఎలక్షన్ ముందే జనసేనలోకి తీసుకోవాలని అనుకున్న అని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను మరల వెనక్కి వెళ్ళిపోతున్నాను అని సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. జగన్ కోసం నా మంత్రి పదవని వదులుకున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *