సిరా న్యూస్,పల్నాడు;
రాజుపాలెం మండలం పెదనెమలిపురి గ్రామంలో పోలీసుల కార్దన్ సెర్చ్ జరిపారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్పీ కె. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ యం. హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ జరిగింది. కార్డెన్ సెర్చ్ లో సబ్ డివిజన్ లోని సీఐ లు, ఎస్సైలు,పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.
డి.ఎస్.పి హనుమంతరావు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ ఉపేక్షిస్తే కఠిన చర్యలు తప్పవు. గొడవలు,అల్లర్లకు పాల్పడే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ప్రజలకు చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసులకు తెలియజేయండి.. 24 గంటల పాటు పోలీసు వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. క్షణికావేశంలో చేసే తప్పులకు జీవితాంతం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలాంటివేమీ లేకుండా అందరూ మంచితనంతో మెలగాలని అన్నారు.