సిరా న్యూస్,కాకినాడ;
ఆటిజం పిల్లలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిందిగా ఆసరా సెంటర్ ఫర్ ఆటిజం వ్యవస్థాపకురాలు సునీత విజ్ఞప్తి చేశారు. ఆటిజం పిల్లలు రూపొందించిన దీపావళి ఉత్పత్తుల ప్రదర్శనను ప్రముఖ ఇంజనీర్ ఎస్.ఎస్. బలరాం.,కాకినాడ జిల్లా.. కాకినాడ ఎన్.ఎఫ్.సి.ఎల్ రోడ్., నున్న ఆనంద హాస్పిటల్ ప్రాంగణంలోని ఆటిజం సెంటర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఈ పిల్లలకి ఒకేషనల్ శిక్షణ ఎంతో అవసరమని దీనిపై పేరెంట్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద పిల్లలను ఇంట్లో ఉంచకుండా ప్రతిరోజు కొంత సమయం బయట ప్రపంచాన్ని చూపించే విధంగా తీసుకు వెళ్లాలని కోరారు. మానసికంగా వారిలో ఆనందం కలిగించే విధంగా పేరెంట్స్ ప్రత్యేక విషయాలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరి పిల్లలు ఇలాగే మీరు ఉండరని వీరి ప్రపంచమే వేరుగా ఉంటుందని అయినప్పటికీ వీరి పేరెంట్స్ కి మోటివేషన్ సెంటర్ నిర్వహిస్తున్నామన్నారు. తమ సెంటర్లో పిల్లలు కేవలం 3 నుండి 5 గంటల పాటు ఉంటారని, మిగిలిన సమయాల్లో వారి వారి ఇంట్లో ఏదో విధంగా వారి చేత చిన్న చిన్న పనులను చేయిస్తూ ఆలోచన మరియు జ్ఞాపక శక్తి పెంచే విధంగా కృషి సూచించారు. పిల్లలు తయారు చేసిన దీపావళి వస్తువులు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని వాటిని కొనుగోలు చేయడం ద్వారా వీరి శ్రమ మరియు కృషిని ప్రోత్సహించిన వారు అవుతామన్నారు. ఈ రంగంలో ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని ప్రభుత్వం కూడా ఇటువంటి కేటగిరీలో ఉన్న పిల్లలకు ప్రత్యేక బోధనా సదుపాయాలను కల్పించాల్సిందిగా ఎన్నటినుండో విజ్ఞప్తి చేస్తున్నామని ఆమె గుర్తు చేశారు. వీరందరికీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంతో అవసరమన్నారు. ఆటిజం పిల్లలు పనిచేస్తూ ఆనందాన్ని పొందే విధంగా ప్రతి పేరెంటు శ్రద్ధ కనపరచాల్సిన అవసరం ఉంది అన్నారు. వీరందరి చేత మరిన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి అవసరమైన పరికరాలు దిగుమతి చేసుకుంటున్నామని ఆమె చెప్పారు. ఈ ప్రదర్శన ఈనెల 30 సాయంత్రం 8 గంటల వరకు ఉంటుందని వివరించారు. ఈ పిల్లలు వస్తువులను తయారు చేసే సమయంలో పేరెంట్స్ గా తమ సహాయ సహకారాన్ని కూడా అందించడం జరిగిందని, వారి ఏకాగ్రతతో చేసిన వస్తువులు చూపరులను ఆకట్టుకునే విధంగానూ పర్యావరణహితంగానూ ఉందన్నారు. ఇతర వివరాలకోసం 9246644749, 98482 29911 లో సంప్రదించవచ్చన్నారు.
ఇంజనీర్ బలరాం మాట్లాడుతూ ఇటువంటి పిల్లల కోసం ప్రత్యేక సెంటర్ ను నిర్వహిస్తున్నారని వాటిలో బోధనతో పాటు పరిసరాలలో ఏ విధంగా నడుచుకోవాలో అన్న అంశంపై కూడా వివరిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ నిహారిక(విశాఖపట్నం), అరవింద్, ఎం. నవీన్ తో పాటు పలువురు పేరెంట్స్ కూడా పాల్గొన్నారు.