సిరా న్యూస్,హైదరాబాద్;
జన్వాడా ఫాంహౌజ్ కేసుతో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీలు చేసుకోవడమే కాకుండా పార్టీలో విదేశీ లిక్కర్, డ్రగ్స్ వాడినట్టు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇందులో ప్రముఖల బంధువుల పేర్లను కూడా ప్రస్తావించారు. ఈ కేసులో ఓవైపు విచారణ సాగుతుంటే… మరోవైపు రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఏం జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు పార్టీకి అనుమతి తీసుకోలేదని చెప్పడంతో చాలా మందికి కొత్త సందేహం వచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీలు చేసుకుంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అధికారులు మాత్రం అవును అనే సమాధానం చెబుతున్నారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లిక్కర్‌తో పార్టీ చేసుకుంటే కచ్చితంగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. పార్టీ ఎక్కడైనా సరే అధికారులు అనుమతి లేకుండా లిక్కర్ పెట్టడానికి లేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, నివాసాల వద్ద జరిగే ప్రైవేట్ పార్టీల్లో భారీగా మద్యం సరఫరా చేసేందుకు లైసెన్స్ తప్పనిసరి. ఇంట్లో జరిగే పార్టీలకు ఆరు బాటిళ్లలోపు మద్యం తాగేందుకు అనుమతి ఇస్తారు. అంతకు మించి వాడకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా పర్మిషన్ తీసుకోవలంటే దరఖాస్తు P&E విభాగానికి ఇవ్వాలి. వీళ్లు తనిఖీలు చేసేటప్పుడు అనుమతికి మించిన మద్యం చిక్కుతే మాత్రం విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ వెన్యూ ఓనర్‌పై కూడా కేసులు బుక్ చేస్తారు. ప్రైవేట్ ఫంక్షన్లలో మద్యం సేవించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. స్పోర్ట్స్, కమర్షియల్, ఎంటర్టైన్మెంట్ కేటగిరీకి సంబంధించినది ఈవెంట్స్ అయితే వాటి అనుమతికి ప్రత్యేక రూల్స్ ఉంటాయి. టిక్కెట్ల సంఖ్యను బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. పార్టీలకు కూడా స్లాట్లు ఉంటాయి. ఒక రోజులో రెండు స్లాట్‌ల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఒక స్లాట్ ఉంటుంది. సాయంత్రం 7 నుంచి 11 గంటల వరకు మరో స్లాట్ ఉంటుంది. ఈవెంట్ దరఖాస్తు చేయడం అనుమతి తీసుకోవడం ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. అవసరమైన సర్టిఫికేట్స్ పోర్టల్ ద్వారా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన 48 గంటల్లో అనుమతులు ఇస్తారు
లిక్కర్ పార్టీ అంటే పీపాలు పీపాలు పోయడానికి కూడా వీలు లేదు. కేవలం రోజుకు 12000 రూపాయల లిక్కర్ మాత్రమే సప్లై చేయాలి. అంతకు మించి చేయడానికి వీలు లేదు. 100 మంది కంటే తక్కువ మందితో పార్టీ చేసుకుంటే 10000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి అనుమతి పత్రాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వంద మంది ఒక్కరు ఎక్కువ ఉన్నా సరే 15000 రూపాయలు చెల్లించి అనుమతి తీసుకోవాలి. చేసుకునే పార్టీకి బందోబస్తు కావాలంటే కూడా పోలీసులకు రిక్వస్ట్ పెట్టుకోవచ్చు.
భారీ స్థాయిలో పార్టీ పెట్టుకుంటే కావాల్సిన అనుమతులు ఇవే
NOC: పార్టీ పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అసిస్టెంట్ హెల్త్ ఆఫీస్ సంతకం చేసి ఇచ్చిన ఎన్వోసీ
ఫుడ్ లైసెన్స్: పార్టీ సమీపంలో ఓ కిచెన్ ఏర్పాటు చేసి ఫుడ్ వండి పెట్టే ఫెసిలిటీ ఉంటే మాత్రం కచ్చితంగా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి.
స్పెషల్ ఈవెంట్ లైసెన్స్: వంద మంది వరకు జనాలుపార్టీకి వస్తే 10000 రూపాయలు, అంతకు మించి వస్తే 15000 రూపాయలు చెల్లించి ఈ స్పెషల్ లైసెన్స్ తీసుకోవాలి.
వీటితోపాటు 2బీ బార్లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్టమెంట్ అనుమతి కూడా తీసుకోవాలి.