సిరా న్యూస్,వారణాసి;
ధన త్రయోదశి సందర్భంగా కాశీ విశ్వేశ్వరుని క్షేత్రంలో ఉన్న మాతా అన్నపూర్ణ మంగళవారం బంగారు అన్నపూర్ణగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ రోజు నుండి నవంబరు 2వ తేదీ శనివారం వరకు బంగారు అన్నపూర్ణ ఈ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. బంగారు అన్నపూర్ణను తెలుగు రాష్ట్రాల ప్రజలు విశేష సంఖ్యలో దర్శించుకుంటున్నారు.