సిరాన్యూస్, తిమ్మాపూర్
మహా సమ్మేళనం కరపత్రాల విడుదల : ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాళ్ల నరేష్
* విద్య, వైద్యం ,ఉపాధి, ఇల్లు, భూమి కోసం పోరాటం
పేద ప్రజలందరికీ భారత రాజ్యాంగం ఉచితంగా అందించే విద్య, వైద్యం, ఉపాధి ఇల్లు భూమి అనే మౌలిక అంశాల కోసం ధర్మ సమాజ్ పార్టీ పోరాటానికి సిద్ధం కాబోతుందని ధర్మ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తాళ్ల నరేష్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ నవంబర్ 3న హైదరాబాద్‌లో జరిగే కార్యకర్తల మహా సమ్మేళనం కరపత్రాలను రామకృష్ణ కాలనీ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణ అమలు కోసం హైదరాబాద్ లో వేల మందితో భారీ ప్లీనరీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్నారం బాబు, గాజుల రవి, జిల్లెల సురేష్, కవంపల్లి నరసన్న , రమేష్ తదితరులు పాల్గొన్నారు.