నెల్లూరులో బ్లూ వర్సెస్ ఎల్లో ఆర్మీ

సిరా న్యూస్,నెల్లూరు;
ఏపీ.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తోచ్చేది రాజకీయం. ఏ పని చేస్తున్నా.. ఎక్కడ ఉన్నా.. అక్కడ రాజకీయం కామన్. తాజాగా దీపావళి పండగ సందర్భంగా కూడా పొలిటీషియన్స్‌ను వాడేస్తున్నారు. నెల్లూరులో బాణసంచా వ్యాపారులు వినూత్నంగా ఆలోచించారు. పొలిటికల్ టపాసులను విక్రయిస్తూ ఆకర్షిస్తున్నారు.నెల్లూరులో వినియోగదారులను ఆకర్షించడానికి బాణసంచా వ్యాపారులు వినూత్నంగా ఆలోచించారు. బాణసంచా పెట్టెలకు రాజకీయ రంగులేశారు. ఏ పార్టీని ఇబ్బంది పెట్టకుండా.. రెండుపార్టీలను సమానంగా చూశారు. టీడీపీ, వైసీపీ రంగులతో బాక్స్‌లు తయారు చేసి.. వాటిపై ఆయా పార్టీల నేతల ఫొటోలు వేసేశారు. నెల్లూరు ఇప్పుడు ఈ యాపారం ట్రెండింగ్‌లో ఉంది.పసుపు రంగు బాక్స్‌లకు యెల్లో ఆర్మీ అని రాసిపెట్టారు. వాటిపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్ బొమ్మలు ఉన్నాయి. సైకిల్ గుర్తును మధ్యలో పెట్టారు. ఇక మరో పొలిటికల్ టపాసుల బాక్స్‌కు బ్లూ కలర్‌ వేశారు. దానిపై బ్లూ వారియర్స్ అని రాసి ఉంది. ఈ బాక్స్‌పై వైఎస్ జగన్, వైఎస్సార్ చిత్రాలు ఉన్నాయి. ఈ పొలిటికల్ టపాసులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు.పొలిటికల్ టపాసుల సంగతి అటుంచితే.. బాణసంచా విక్రయ కేంద్రాల్లో జాగ్రత్తలు పాటించాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పలు నిబంధనలు వెల్లడించిందని.. వాటిని పాటించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
జాగ్రత్తలు ఇవే..
1.టపాసులు విక్రయించే దుకాణాల వద్ద బకెట్లలో ఇసుక, డ్రమ్ముల నిండుగా నీళ్లు ఉంచుకోవాలి.
2.చట్టబద్ధంగా ఆమోదించిన, నాణ్యమైన టపాసులనే విక్రయించాలి.
3.నాణ్యతతో కూడిన తీగలు, విద్యుత్తు సామాగ్రితో వసతులు ఏర్పాటు చేసుకోవాలి.
4.పోలీస్, అగ్నిమాపక శాఖ తనిఖీల్లో బాణసంచా అక్రమ నిల్వలను గుర్తిస్తే కఠిన చర్యలుంటాయి.
5.నిబంధనల ప్రకారం ఇళ్ల మధ్య పెద్ద ఎత్తున నిల్వలుంచొద్దు. అలా చేస్తే లైసెన్స్‌లు రద్దు చేసి కేసులు నమోదు చేస్తాం.
6.నాణ్యమైన టపాసులు కొనుగోలు చేయడం ఉత్తమం.
7.భవనాలు, వాహనాలు, మండే స్వభావం ఉన్న పదార్థాలకు దూరంగా.. పార్కులు, మైదానాలు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం మంచిది.
8.కాటన్‌ వస్త్రాలు ధరించాలి. కాల్చిపడేసిన వాటిని ఒక బకెట్‌లో వేయాలి.
9.చిన్నారులు బాణసంచా కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. పేలని టపాసులను మళ్లీ కాల్చేందుకు ప్రయత్నిస్తారు. కళ్లు, చేతులకు గాయాలయ్యే ప్రమాదముంది.
10.తక్షణ సాయానికి..: ఏదైనా ప్రమాదం సంభవించినా, ఇబ్బందులెదురైనా వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *