పవర్ ప్లాంట్ లు మూతపడ్డాయి
– మంత్రి కొల్లు రవీంద్ర
సిరా న్యూస్,మచిలీపట్నం;
కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరంలో 5 వ.డివిజన్ లోరాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తో కలిసి పర్యటించారు. స్థానిక ప్రజలను నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పెన్షన్ రోజు సందర్భంగా అర్హులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర సూపర్ 6లో భాగంగా గ్యాస్ కనెక్షన్స్ ఈరోజు నుండి ఇస్తున్నామన్నారు రేపటి నుంచి మిషన్ పాటోల్ ఫ్రీ ఏపీ కార్యక్రమం ద్వారా నియోజకవర్గాల్లో గుంతలు పూడ్చడం కల్వర్టుల నిర్మాణం లు సంక్రాంతి పండుగలోపు పూర్తి చేసేందుకు చర్చలు చేపడుతున్నామన్నారు
విద్యుత్ పై ప్రతిపక్షాల మాటలను గత ప్రభుత్వం విద్యుత్ బకాయిలతో అస్తవ్యస్తంగా తయారైందని పవర్ ప్లాంట్ లు మూతపడ్డాయని స్పష్టం చేశారు విద్యుత్ ఇబ్బందులు లేకుండా నూతన పాలసీని తీసుకొస్తున్నామని ఇండస్ట్రీస్ పాలసీ కూడా ఇచ్చామని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సామాన్యుడు కూడా పరిశీల పెట్టుకునేందుకు లక్ష్యంతో పని చేస్తున్నామని మంత్రి అన్నారు.