సిరాన్యూస్, చర్ల
గీధ కోదండ రామయ్య కుల ధ్రువీకరణ పత్రం రద్దు: రాష్ట్ర గోండ్వానా సంక్షేమ పరిషత్ అధ్యక్షులు సత్యనారాయణ
* సుదీర్ఘ పోరాటం తర్వాత వెలువడిన తీర్పు
* ఇది ఆదివాసీల విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన గీధ కోదండరామయ్య తండ్రి ముత్తయ్య గత (25) సంవత్సరాలుగా ఎస్టీ బోగస్ కుల ధ్రువీకరణ పత్రంతో షెడ్యూలు తెగల రిజర్వేషన్లు అనుభవిస్తూ, అనేక రాజకీయ పదవులను ఎస్టీ రిజర్వేషన్లలో పొంది అటు ప్రభుత్వాలను, ఆదివాసీలను మోసం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో గీధ కోదండ రామయ్య పై 2016 జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి ఇప్పటివరకు సుదీర్ఘకాలం పోరాటం తర్వాత ఆర్సీ నెం. డీ3/3041/2016 నుండి 16/10/2024 జిల్లా కలెక్టర్ గీధ కోదండ రామయ్య ఎస్టీ బోగస్ కుల ధ్రువీకరణ పత్రమును రద్దు చేస్తూ తీర్పు వెల్లడించారు. ఈ బోగస్ కుల ధ్రువీకరణ పత్రంపై సుదీర్ఘకాలం పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్ర గోండ్వానా సంక్షేమ పరిషత్ అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్టి బోగస్ కుల ధ్రువీకరణ పత్రంతో గీధ కోదండ రామయ్య అనేక పదవులను చేపట్టి లక్షలాది రూపాయలు సంపాదించాడని, అతనిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని అంటూ సుదీర్ఘకాలం పోరాటం తర్వాత ఈ తీర్పు పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో తమకు మద్దతుగా నిలిచిన ఏటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.