సిరా న్యూస్, గుడిహత్నూర్:
ఉదారత చాటిన దాతలు
+ బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత..
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు పూర్తిగా దగ్ధమై సర్వస్వం కోల్పోయిన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం దొంగర్ గావ్ గ్రామానికి చెందిన సుధాకర్ కుటుంబ సభ్యులకు నిత్యవసర సరుకులు అందజేశారు. సామాజిక కార్యకర్త, జై దేవి మెడికల్ యజమాని మదన్ గిత్తే ఆదివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యవసర సరుకులతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన వెంట ముండే గణేష్, బండారి రవీందర్, సంజీవ్, ఈశ్వర్, తదితరులు ఉన్నారు.