SP Rohit Raju: హోంగార్డు ఆఫీసర్స్ సమస్యల పరిష్కారానికి కృషి : ఎస్పీ రోహిత్ రాజు

సిరాన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం
హోంగార్డు ఆఫీసర్స్ సమస్యల పరిష్కారానికి కృషి : ఎస్పీ రోహిత్ రాజు
* ఎస్పీ రోహిత్ రాజుకు వినతిపత్రం అందజేసిన జిల్లా హోంగార్డ్స్ ఆఫీసర్స్ అసోసియేషన్

నిత్యం ప్రజలకు సేవలు అందిస్తూ,శాంతిభద్రతల పరిరక్షణ కోసం పాటుపడే పోలీసులకు సహాయకారులుగా పనిచేసే హోంగార్డు ఆఫీసర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలిపారు. శ‌నివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని హోంగార్డ్స్ సమస్యలను అసోసియేషన్ తరపున వినతిపత్రం రూపంలో ఎస్పీకి అంద‌జేశారు..ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు ఆఫీసర్స్ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.జిల్లాలోని ఆస్పత్రుల్లో,విద్యా సంస్థల్లో ఫీజుల రాయితీ గురించి యాజమాన్యాలతో చర్చిస్తామని తెలియజేసారు.జిల్లాలో పనిచేసే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరూ క్రమశిక్షణతో,సమయపాలన పాటిస్తూ తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.ఉద్యోగ పరంగా , వ్యక్తిగత పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ ఈ సందర్బంగా కోరారు. కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, హోమ్గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు, ఎంటిఓ సుధాకర్, హోంగార్డ్స్ అసోసియేషన్ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *