సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ మహా విష్ణు వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుండి భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. ఉత్తర శ్రీరంగంగా పిలిచే నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన పెంచలకోన నరసింహకొండ లక్ష్మీనరసింహస్వామిదేవస్థానంలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కావలి విష్ణాలయంలో రాజ్యసభ సభ్యుల బీద మస్తాన్ రావు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శ్రీమహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.అర్ధరాత్రి నుండి విష్ణాలయం క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.