సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయానికి వచ్చిన మంత్రి నారాయణ కు కూటమి పార్టీల నేతలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చిన రాజప్ప,ఎమ్మెల్యే లు పంతం నానాజీ,వరుపుల సత్య ప్రభ,ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్,పార్టీ ఇన్చార్జి లు,ముఖ్య నేతలు పాల్గోన్నారు. తరువాత అయన టీడీపీ, జనసేన,బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైయారు. జిల్లాలో పార్టీల పరిస్థితి,కూటమి పార్టీ నేతల మధ్య సమన్వయం,ఎమ్మెల్సీ ఎన్నికలు పై సమావేశంలో చర్చ జరిగింది. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉండటంతో అధికారిక కార్యక్రమాలు కాకుండా కేవలం పార్టీ కార్యక్రమాలకే మంత్రి తన పర్యటన పరిమితం చేసారు.