సిరాన్యూస్, కళ్యాణదుర్గం
ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష
అనంతపురం నగరంలోని ఎస్పీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాత్రి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆమెకు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు. రాయలసీమ ఐజి శ్రీకాంత్, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోస్, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్, శ్రీసత్య సాయి జిల్లా ఎస్పీ రత్నతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన డీఎస్పీలు, సీఐలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాత్రి పది గంటల వరకు ఈ సమీక్ష కొనసాగింది. అనంతరం మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఏర్పాటు చేసిన విందుకు ఆమె హాజరయ్యారు. ఈ విందులో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.