మెడికవర్ ఆసుపత్రి నిర్వాకం
సిరా న్యూస్,హైదరాబాద్;
హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్ లో దారుణం బయటపడింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుటుంబీకులు ఇప్పటి వరకు మూడులక్షలకు పైగా డబ్బు కట్టారు. మిగతా నాలుగు లక్షలు కడితేనే డెడ్ బాడీ ఇస్తానని ఆస్పత్రి వర్గాలు డిమాండ్ చేసినట్లు బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చెప్పినా వినడంలేదు. మంగళవారం అర్ధరాత్రి మరో మూడు లక్షలు కట్టాలని లేదంటే వైద్యం ఆపేస్తామంటూ కుటుంబీకులకు ఫోన్ కాల్ వచ్చింది. ఉదయాన్నే లక్ష కట్టిన తరువాత పేషంట్ మృతి చెందింది. మిగతా డబ్బు అంటూ ఆసుపత్రి యాజమాన్యం బేరం పెట్టింది. వైద్యం ఆపేయడం వల్లే నాగప్రియ చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో మెడికవర్ ఆస్పత్రి వద్ద టెన్షన్ నెలకొంది