సిరాన్యూస్,ఆదిలాబాద్
రాహుల్ గాంధీ సభలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ కంది శ్రీనివాస రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణనపై ఏర్పాటు చేసిన సదస్సుకు లోక్ సభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై సీఎంరేవంత్ రెడ్డి , కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క ఆసీనులయ్యారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బోయిన్ పల్లి లోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో మేధావులు ,సామాజిక వేత్తలు , వివిధ సంఘాల నాయకులు , కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులతో నిర్వహించిన కులగణన సంప్రదింపుల సదస్సులో జిల్లాకు చెందిన ఆదిలాబాద్ , బోథ్ నియోజకవర్గాల ఇంఛార్జీలు కంది శ్రీనివాస రెడ్డి ,ఆడె గజేందర్ పాల్గొన్నారు.