BRS Rega Kantha Rao: చర్ల బీఆర్ఎస్‌ పార్టీ కన్వీనర్గా దొడ్డి తాతారావు నియామ‌కం : బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

సిరాన్యూస్, చర్ల:
చర్ల బీఆర్ఎస్‌ పార్టీ కన్వీనర్గా దొడ్డి తాతారావు నియామ‌కం : బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బుధవారం చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ నూతన కన్వీనర్ కో కన్వీనర్ గా దొడ్డి తాతారావు, అయినవోలు పవన్ కుమార్ లను నియమించడం పట్ల చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమించబడిన చర్ల పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు, కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ మాట్లాడారు.పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామపంచాయతీ కమిటీని ఏర్పాటు చేసి పార్టీ బలోపే తనికి కృషి చేస్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని పటిష్ట పరిచి కార్యకర్తలను సైనికులుగా తయారు చేస్తామని తెలిపారు. పార్టీ నాయకులకు కార్యకర్తల కు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా పాటు పడతామని చెప్పారు .మా మీద ఎంతో నమ్మకంతో పార్టీ బాధ్యతలు మాకు అప్పగించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావుకి, భద్రాచలం డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ , మానె రామకృష్ణ,చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *