సిరా న్యూస్,కాకినాడ :
పెద్దాపురం మండలం కాండ్రకోటలో గ్రామానికి చెందిన మహిళకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. సదరు మహిళ అనారోగ్యంగా ఉన్న బంధువులను చూసేందుకు కాకినాడ వెళ్లింది. వారం రోజులుగా కాకినాడలోనే ఉంది. రెండ్రోజుల క్రితం మహిళకు ఆయాసం ఎక్కువగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కొవిడ్ పాజిటివ్ రావడంతో కాకినాడ జీజీహెచ్ లోని ప్రత్యేక వార్డులో ఉంచి చికత్స అందిస్తున్నారు. వైద్య సిబ్బంది మహిళకు సంబందించిన కాంటాక్ట్స్ పై ఆరా తీస్తున్నారు.