సిరా న్యూస్,నాగార్జునసాగర్;
ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య నాగార్జున సాగర్ వద్ద మరోసారి వివాదం చెలరేగింది. కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదుకు తెలంగాణ అధికారులు వచ్చారు. వీరిని ఏపీ అధికారులు అడ్డుకోవడంతో ఆ ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై కేఆర్ఎంబీ యాజమాన్యానికి తెలంగాణ అధికారులు సమాచారం ఇచ్చారు. సాగర్ ఎస్ఈ కృష్ణమోహన్ ఇరు రాష్ట్రాల అధికారులకు సర్ది చెప్పారు.