సిరాన్యూస్, ఆదిలాబాద్
అనాధ ప్రేమ షూటింగ్ ను ప్రారంభించిన మాజీ మంత్రి జోగురామన్న
* ఆదిలాబాద్ జిల్లాలో కళాకారులకు కొదవలేదు..
ఆదిలాబాద్ జిల్లాలో కళాకారులకు కొదవలేదని, అదిలాబాద్ అందాలు సినీ పరిశ్రమతో పాటు టూరిస్టులు సైతం ఆకట్టుకుంటుందని, యువత సినిమా రంగంలో తమ కలను నిరూపించుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం యాదవ సంఘం భవనంలో నూతన సినిమా ప్రారంభోత్సవానికి క్లాప్ కొట్టి సినిమాలు ప్రారంభించారు. ఏబి క్రియేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్ గాజు గౌడ్ దర్శకత్వంలో నూతన చిత్రం అనాధ ప్రేమ షూటింగ్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా జోగు రామన్న పాల్గొని ప్రారంభించారు. మొదట వినాయకుడి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ యువత కళా నైపుణ్యానికి పదును పెడుతూ చిత్ర పరిశ్రమల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ గణనీయంగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. చిన్నపాటి సినిమాలకు సైతం ఆదిలాబాద్ లొకేషన్ లో ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. పలు సినిమాలలో సైతం ఆదిలాబాద్ ఎంతగానో పేరుపొందింది అన్నారు. ఏపీ క్రియేషన్ వారిని అభినందిస్తూ వాటికి పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలిపారు. యువతీ యువకులు వారి నటన కళా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ సినిమా చిత్ర పరిశ్రమల రాణించేలా కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రాలాద్, బట్టు సతీష్, చిన్న పటేల్, డైరెక్టర్ గజ్జు గౌడ్, భూపతి,నారాయన్ రెడ్డి హీరో కళ్యాణ్ హీరో బిమేష్,హీరోయిన్ యోగితా విల్లన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.