సిరాన్యూస్, ఓదెల
ఐకేపీ సెంటర్‌ను సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ వేణు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో శనివారం నూతనంగా వచ్చిన పెద్దపెల్లి జిల్లా రెవెన్యూ అదనపు జిల్లా కలెక్టర్ దాసరి వేణు రైతు వేదిక దగ్గర్లో ఉన్న ఐకెపి సెంటర్ ను సందర్శించారు. ఈసందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ వేణు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు జరగాలని, అలాగే వడ్లలో తేమ శాతం 17 లోపు ఉండాలని అన్నారు. వరి ధాన్యంలో నాణ్యత ఉండాలని తెలిపారు.వీరి వెంట ఓదెల మండల వ్యవసాయ అధికారి బి భాస్కర్, ఓదెల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్, ఐకెపి సిబ్బంది తదితరులు ఉన్నారు.