సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డిని సన్మానించిన చిన్ననాటి మిత్రులు
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన రామిడి తిరుపతి రెడ్డి ని చిన్ననాటి మిత్రులు ఘనంగా సన్మానించారు. శనివారం వారి స్వగృహంలో మిత్రులు సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్, వావిలాల ఖాదీ, ప్రతిస్టాన్ సూపరింటెండెంట్ నాగమల్ల శ్రీనివాస్, బోయిని నర్సయ్యలు రామిడి తిరుపతి రెడ్డిని శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా ప్రజా సేవచేసి పదోన్నతు పోంది మార్కెట్ చైర్మన్ గా రైతుల పక్షాన సేవచేసే అవకాశం రావటం సంతోషకరమైన విషయమని తెలిపారు.భవిష్యత్ లో మరింత సేవలు అందించటానికి ముందుకు పోవాలని మిత్రులు కోరారు.