సిరాన్యూస్, బేల
రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి : యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి
* సోయా రైతుల ఖాతాలో 11.82 కోట్లు డబ్బులు జమ
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సోయా కొనుగోలు కొనసాగుతున్న రైతుల ఖాతాలో మాత్రం డబ్బులు జమ కావడం లేదన్న బీఆర్ఎస్ నాయకులు వాస్తవం తెలుసుకొని మాట్లాడాలని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి అన్నారు.గడిచిన మూడు రోజుల క్రితం కొందరు బీఆర్ఎస్ నాయకులు సోయా రైతులకు అసలు ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న డబ్బులు ఎందుకు జమ చేయడం లేదని విమర్శలు చేయడం మానుకోవాలని ఒక ప్రకటనలో తెలియజేశారు.ఇదే విషయంపై సంబంధిత మార్క్ ఫెడ్ డి.ఎం ను సంప్రదించి వివరాలు తెలుసుకున్నామని ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 6,551 మంది రైతుల నుంచి 1,12,522 క్వింటాళ్లు కొనుగోలు చేసి సుమారు 1500 మంది రైతులకు 11 కోట్ల 82 లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందని తెలియజేశారు.అంతేకాకుండా రోజువారీగా చేపడుతున్న సోయా కొనుగోలు లో రైతులకు వారి వారి ఖాతాలకు డబ్బులు జమ చేయడం జరుగుతుందని వెల్లడించారు.గతంలో ఎన్నడు కూడా రోజువారిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు డబ్బులు చెల్లించలేదన్న విషయం తెలుసుకొని మాట్లాడాలని కోరారు.