సిరాన్యూస్,చిగురుమామిడి
బొమ్మనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ కార్మికుల నిరసన
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్యాలయంలో పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్స్, గ్రామపంచాయతీ పారిశుద్ధ సిబ్బంది తమ జీతాలు మూడు నెలలుగా రావడం లేదని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు నెలల్లో రావలసిన జీతాలు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.జీతం రాకపోతే ఏ విధంగా జీవనం గడుస్తుందని ప్రశ్నించారు. మండల పంచాయతీ అధికారికి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ కి విన్నవించిన ఫలితం లేదని తెలిపారు.రేపటి నుంచి పనులు చేయమని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీతాలు వేయాలని డిమాండ్ చేశారు.ఈ విషయమై మండల అధికారులను వివరణ కోరగా రెండు నెలల్లో ఇద్దరు కార్యదర్శులు బదిలీ కాగా డిజిటల్ కి విషయంలో ఇబ్బందుల వల్ల వేతనాలు అందజేయడం ఆలస్యం అవుతుందని తెలిపారు. తొందరలోనే జీతాలు పడతాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పోతుల రమేష్ , రాజేశం,మచమల్ల కిరణ్, కొంకట మల్లయ్య, భాగ్య, పద్మ, లచ్చవ్వ పాల్గొన్నారు.