Excise SI Vinod Kumar: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్

సిరాన్యూస్, సైదాపూర్:
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్
* డ్రగ్ రహిత తెలంగాణ మన లక్ష్యం కావాలి

విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హుజురాబాద్ ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం సైదాపూర్ మండలంలోని ఎక్లాస్ పూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్ రహిత తెలంగాణ నినాదంతో మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లు వాటి దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.ఈ సంద‌ర్బంగా ఎక్సైజ్ ఎస్సై వినోద్ కుమార్. మాట్లాడుతూ గ్రామాల్లో యువత చెడువైపు వేగవంతంగా మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులై తమ జీవితాల్ని కోల్పోతున్నారని, కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, తాత్కాలిక ఆనందం క్షణికమైన ఒత్తిడి నుండి తట్టుకోవడానికి డ్రగ్స్ ను ఆసరా చేసుకుంటున్నారని అది చాలా బాధాకరమని, విచారం వ్యక్తం చేశారు. గంజాయి, కల్తీకల్లు, గుట్కా, అంబర్ లాంటి పాన్ మసాలాలు, ధూమపానం, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు అన్నింటికీ దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాలు ఎవరైనా అమ్మినా, ఉపయోగించినా చట్టారీత్యా నేరమని పేర్కొన్నారు. అలాంటి సందర్భాలు ఎవరి దృష్టి కైనా వస్తే 1908 కి టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని యువత మంచి నాగరికులు గా తయారవ్వాలని పిలుపునిచ్చారు. చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ సర్వీస్ వాలంటీర్ రమేష్ మాట్లాడుతూ పిల్లల హక్కులు రక్షించబడాలని, పిల్లలపై సోషల్ మీడియా సెల్ ఫోన్ ల ప్రభావం అధికంగా ఉందని, చెడు వైపు యువత వెళ్లవద్దని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్టా రవీంద్ర చారి, ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వరూప, ఉపాధ్యాయ బృందం సంపత్ రెడ్డి, మధు కుమార్, స్వామి, మునీశ్వరి, వేణుగోపాల శర్మ, జహూర్, సీఆర్పి రమేష్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *