ఎమ్మెల్యే పాయంపై విరుచుకపడ్డ రేగా

సిరా న్యూస్,మణుగూరు;
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పై సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాట్ కామెంట్స్ చేసారు. మా నోర్లు బాగానే ఉన్నాయి పాయం… మీ నోర్లు అదుపు తప్పాయి అందుకే ప్రజా తిరుగుబాటు మొదలైంది.. మీ చిల్లర మాటలకు కొడంగల్ లో అధికారులు బలైనారు.. మిగిలింది మీరే ఇక కాస్కో.
మీ సీఎం ఎన్నికల సమయంలో మణుగూరు రోడ్ షో లో బట్టలూడదీసి కొడతారు అని అన్నారు వాస్తవం మీ విషయంలో నిజమే చెప్పాడు.. జరుగుతుంది చూడు.. బ్రహ్మం రి అంతటి కాలజ్ఞాని మీ రేవంత్ రెడ్డి.ఇండ్లు అలకంగనే పండగ కాదు ముందుంది ముసళ్ళ పండగ.. ఆరు గ్యారెంటీ లను అమలు చేయకపోతే జనాలు మీ కీళ్లు ఇరగొట్టడం ఖాయం.. గతంలో చినరాయిగూడెం గోదావరి నదిపై బ్రిడ్జి 100 కోట్లు.. ఇప్పుడు రోడ్లకు మంజూరు చేసిన 100 కోట్లు రద్దు చేసినందుకు నిన్ను ఆయా గ్రామాల ప్రజలు గుడ్డలూడదీసి కీళ్లు ఇరవడం ఖాయమని అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *