సిరా న్యూస్, అదిలాబాద్:
న్యాయవాది సంగెం సుధీర్ కుమార్ కు సేవా పురస్కారం
ప్రముఖ న్యాయవాది సంగెం సుధీర్ కుమార్ ను సేవా పురస్కారం వరించింది. ఆదివారం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో ప్రముఖుల చేతుల మీదుగా ఆయన సేవా పురస్కారం అందుకున్నారు. తన మాతృమూర్తి స్వర్గీయ గిర్మా బాయి పేరిట సంగెం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవ కార్యక్రమాలకు గాను న్యాయవాది సుధీర్ కుమార్ సంగెంకు తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ, సేవా సంస్కృతిక శాఖ, సత్య సంగీత ఇంటర్నేషనల్ సంయుక్తంగా పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో వకుళా భరణం కృష్ణ మోహన్, ప్రముఖ సినీ తారలు కృష్ణ కోటకొండ, శైలజ, రేణుక, సత్య సంగీత ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఓంకార్ రాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ సంగెం మాట్లాడుతూ… పురస్కారం తనపై ఇంకా బాధ్యతను పెంచిందని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్దామని అన్నారు.