సిరా న్యూస్, ఆదిలాబాద్:
మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో మజర్ జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ మజర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న మజర్ను శాలువతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో మజర్ పాత్ర కిలకమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సాజిద్, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు మెట్టు ప్రహ్లాద్, యువ నాయకులు నిరటి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.