సిరా న్యూస్, ఆదిలాబాద్:
సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని ఆ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ కోరారు. సోమవారం కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణం లోని గాయత్రి గార్డెన్ లో రాష్ట్ర మంత్రులు దుద్ధిల్లా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లను కలిసి వినతిపత్రం అందించారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో ఉద్యోగులను క్రమంబద్దికరించాలని విన్నవించారు. దీంతో పాటు సమగ్ర శిక్షా సంఘం నాయకుల తో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరుపాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రులు త్వరలో సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. మంత్రులను కలిసిన వారిలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు రుధ్రవేణి వెంకటి, ప్రధాన కార్యదర్శి రామెల్లి ప్రకాష్, నాయకులు రాకేష్, దేవదర్షన్, విష్ణు, చిరంజీవి, నాగ్ నాథ్, భాను, జావీద్, రాజేశ్వర్త, సురేష్, శ్రీలత గణేష్, తదితరులు ఉన్నారు.