సిరా న్యూస్, నిర్మల్:
దస్తురాబాద్ లో జోరందుకున్న రబీ సాగు…
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో రబీ సాగు జోరందుకుంది. ఎటు చూసినా రైతులు పొలం పనుల్లో బిజీ బిజీగా కనిపిస్తున్నారు. పొలంలో మొలకలు అల్లడం, కేజీ వీల్స్ తో పొలం కొట్టించడం వంటి పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. మండలంలో మొత్తం 9600 ఎకరాల సాగు భూమి ఉండగా, ఈ యాసంగిలో 7600 ఎకరాలు రైతులు సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. యాసంగిలో ప్రధానంగా వరి పంట సాగవుతుండడంతో, రైతులు వరి పొలాలను సిద్ధం చేసే పనుల్లో మునిగిపోయారు.