ఏడాది చెత్త పన్ను వసూళ్ల వివరాలు తెలపండి.

ఒకొక్క వార్డులో ఎంత వసూలైంది.
నెలలో ఎన్ని ఆటోలు తిరిగాయి.
ఏడాది వసూళ్ళు బిల్లులు వున్నాయా.

సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల మున్సపాలిటీలో ఏడాదిగా వసూళ్లు చేస్తున్న చెత్త పన్ను వివరాలు తెలపాల్సిన అవసరం ఎంతైనా వుంది.ప్రభుత్వ ఆదేశాల మేరకు
ఇల్లు,అపార్ట్మెంట్స్,హోటల్స్,లాడ్జి,వ్యాపారసముధాయాలకు వివిధ కేటగిరీల మాదిరిగా పన్నులు వసూళ్లు చేయాలని ఆదేశాలు వున్నాయి.మొదట్లో అధికారులు సీరియస్ గా తీసుకోవడంతో చెత్త పన్ను భాగా వసూళ్లు అయ్యేది.నంద్యాలలో 32 చెత్త ఆటోలు వున్నాయి.ఒకొక్క ఆటోలు దాదాపు 60 వేల పై చిలుకు కిరాయి చెల్లించాలి.చెత్త పన్ను చెల్లించేవారికి గతంలో కొద్ది రోజులు బిల్లులు చెల్లించేవారు.అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో కొందరి వద్ద బిల్లులు ఇవ్వకుండా డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరో వైపు చెత్త పన్ను ముక్కుపిండి వసూళ్ళు చేస్తున్నారు.తాజాగా గత నెల మున్సిపల్ కౌన్సిల్ లో అజెండాలో చెత్త పన్ను బకాయిలు 50 లక్షలు సాధారణ నిధుల నుంచి ఇచ్చేందుకు ఆమోదం తెలపాలని అజెండాలో పెట్టడంతో ప్రతి పక్ష కౌన్సిలర్స్ అభ్యంతరం తెలిపారు.ఏడాదిగా చెత్త పన్ను సరిగా వసూళ్లు కావడం లేదని అధికారుల సమాధానంతో అధికార,ప్రతిపక్ష సభ్యులు మధ్య వాడి వేడిగా వాగ్వివాదం జరిగింది.కొందరు అధికార పార్టీ కౌన్సిలర్స్ అధికారులకు వత్తాసు పలకడం విశేషం.ఏడాదిగా చెత్త పన్ను ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారని,నష్టం ఎలా వస్తుందని,వసూళ్ల వివరాలు ,నెల,నెల ఎన్ని ఆటోలు తిరుగుతున్నాయి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు.డబ్బులు చెల్లించకపోవడంతో కొన్ని ఆటోలు మున్సిపాలిటీ కె పరిమితం అయ్యాయని గుర్తుచేశారు.రేపు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఏడాదిగా ఒకొక్క వార్డులో ఎంత చెత్త పన్ను వసూళ్ళు చేశారు,వసూళ్ళు చేసిన వాటి బిల్లులు,ఆటోలు ఎన్ని తిరిగాయి పూర్తి వివరాలు తెలుపుతారో,ఏదో ఒక గందరగోళం సృష్టించి బెల్లు కొట్టి సభ ముగిస్తారో చూద్దాం.పట్టణంలో ఎన్ని ఇల్లు,అపార్ట్మెంట్స్,వ్యాపార సముదాయాలు ఎన్ని గుర్తించారు,ఎన్నిటికి వసూళ్ళు చేస్తున్నారు,వసూళ్ళు ఎవరు చేస్తున్నారు,బిల్లు బుక్కులు వున్నాయా,బిల్లు ఇవ్వకుండా వసూళ్లు చేస్తున్నా అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదుఅనే ప్రశ్నలకు సమాధానం వస్తుందో లేదో.చెత్త పన్ను వసూళ్లు నష్టపోకుండా,మున్సిపల్ నిధులు ఇవ్వకుండా పెద్ద మనసు చేసుకొని కౌన్సిలర్స్ అందరూ చెత్త పన్ను వసూళ్లకు దగ్గరుండి మీ వార్డుల్లో మీరే నష్టం రాకుండా ఇంటింటికీ తిరిగి వసూళ్లు చేస్తే బాగుంటుంది.మీకు కూడా మంచి పేరు వస్తుంది,లేకపోతే మీ వార్డుల్లో చెత్త పన్ను ఎంత వసూళ్లు అవుతుంది తెలుసుకొని మీరే ముందు చెల్లించి,తర్వాత వసూళ్లు చేసుకోండి.ఓట్లు వేసి గెలిపించిన ప్రజల చెత్త పన్ను కట్టలేరా.ఇంటికి 30 రూపాయలే కదా ఆ మాత్రం కట్టాలేరా.వార్డుల్లో మీరు ఇంటింటికీ చెత్త పన్ను కోసం తిరిగితే అందరూ కడతారు.వచ్చే ఏడాది నుంచి వార్డుల్లో చెత్త పన్ను వసూళ్ళు చేసి ఆదర్శంగా నిలుస్తారని నంద్యాల ప్రజలు ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *