సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖలో శ్రీ కనక మహా లక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్స వాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో గురువారం కావడంతో.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు.. పెద్ద సంఖ్యలో తరలివ స్తున్నారు.స్వర కవచ అలంకారంలో కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చారు. మూడో గురువారం కావడంతో వేలాది మంది అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు.అర్ధ రాత్రి నుంచి భక్తులు క్యూ లైన్ లో అమ్మ వారి దర్శనం కోసం బారులు తీరా రు.పలు ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు రావడంతో సరి కొత్త శోభ సంతరించుకుంది.