సిరా న్యూస్, తలమడుగు:
నాగపూర్ సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…
మహారాష్ట్రలో నాగపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభకు తలమడుగు మండల జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి ఎంపీపీ కళ్యాణ లక్ష్మి రాజేశ్వర్, మాజీ జెడ్పిటిసి బాపన్న, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ… మహారాష్ట్రలోని నాగపూర్ లో పార్టీ ఆవిర్భాసభ కు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హాజరవుతున్నారని అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఖాయమని అన్నారు. అంతకు ముందు జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, మంత్రి సీతక్కను కలిసి శాలువాతో సన్మానించారు.