టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
సిరా న్యూస్,హైదరాబాద్ ;
ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడులు చేయడం సరికాదని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. మహాలక్ష్మి స్కీమ్ అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని దూషించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం సహించదు అని స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ఈ ఘటనపై ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సజ్జనార్ పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు.