నవంబర్ 18 (సిరా న్యూస్)
మెదక్
మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి అస్తికలు గంగలో కలిపేందుకు వచ్చి నీటిలో మునిగి అన్నదమ్ములు మృతి చెందారు. మెదక్- కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు వద్ద ఘటన జరిగింది. మృతులు కామారెడ్డి జిల్లా రాజంపేట (మం) ఇనాం తండాకు చెందిన హర్యా, బాల్ సింగ్ గా గుర్తించారు. అస్తికలు కలిపేందుకు నీటిలో దిగడంతో ప్రవాహానికి అన్నదమ్ములు కొట్టుకుపోయారు. పోలీసులు, ఈతగాళ్లు మృతదేహాల్ని బయటకు తీసారు.
========================