నవంబర్ 18 (సిరా న్యూస్)
బిజెపి నుంచి బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు
హుజురాబాద్
హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంక మండలం కోర్కల్ గ్రామానికి 200 మంది బిజెపి నాయకులు కార్యకర్తలు శనివారం హుజరాబాద్ బిఆర్ఎస్ కార్యాలయం లో హుజరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు 20 మంది ముస్లిం మైనార్టీ నాయకులు కూడా బిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చూసి గతంలో బిఆర్ఎస్ పార్టీలో పనిచేసి బయటకు వెళ్లిన వారంతా తిరిగి మళ్ళీ బిఆర్ఎస్ లోకి వస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పురోగతి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ లో చేరిన కోర్కల్ మాజీ సర్పంచ్ కర్ర దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కౌశిక్ రెడ్డి తోనే సాధ్యమవుతుందని అన్నారు. హుజురాబాద్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, నిన్నటి ఆశీర్వాద సభలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కౌశిక్ రెడ్డికి గొప్ప ప్రాధాన్యమిచ్చారని, హుజురాబాద్ అభివృద్ధిలో ముఖ్యమంత్రి కూడా పాలిపంచుకుంటారని అనడంతో బిఆర్ఎస్ పార్టీ తోనే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో పార్టీలో చేరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, కోర్కల్ గ్రామ సర్పంచ్ మరి స్వామి, ఎంపీటీసీ సమ్మయ్య, గ్రామ అధ్యక్షుడు రాకేష్, నరసింగపల్లి సర్పంచ్ కోమల్ రెడ్డి, నాయకులు తంబాల సమ్మయ్య, శంకర్, బాసుమియా, మునీర్, అంకుస్ అదపాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.