సిరా న్యూస్,బీజాపూర్;
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఆరేళ్ల మైనర్ బాలిక మృతి చెందింది. బాలిక తల్లి చేతికి కాల్పుల గాయాలు అయ్యాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు డీఆర్జీ జవాన్లకు కుడా గాయాలు అయ్యాయి. బాధిత కుటుంబానికి సహాయం చేసేందుకు ఏఎస్పీ పోలీసు బలగాలతో గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎదురు కాల్పుల్లో భైరం ఘడ్ ఏరియా కమిటీ సెక్రటరీ చంద్రన్న, మరికొందరు నక్సలైట్లకు గాయాలు అయినట్లు సమాచారం. ఘటనస్థలంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది