సిరా న్యూస్, డిజిటల్:
మంత్రి సీతక్క, ఇతర ప్రముఖులను కలిసిన సమగ్ర శిక్ష ఉద్యోగులు…
సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం సభ్యులు పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమంబద్దికరించి, వెంటనే మినిమం టైం స్కేల్ అందించాలని వారికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క, త్వరలో సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చినట్లు సంఘం సభ్యులు తెలిపారు. అనంతరం టిపిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డిని సైతం కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. వెంటనే తమను రెగ్యులరైజ్ చేసి ఆదుకోవాలని విన్నవించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి, రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాధవ్, ఉపాధ్యక్షులు దుర్గం శ్రీనివాస్, మెదక్ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు, నాయకులు ఎండి. పాషా, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.