వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించాలి

-మంథనిలో బిఆర్ఎస్ శ్రేణుల నిరసన

సిరా న్యూస్,మంథని;

వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మంథని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గురువారం మంథని అంబేద్కర్ చౌక్ లో రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా, రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, రోడ్డు పై మంథని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బేషరతుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వరి ధాన్యం మద్దతు ధరపై రూ. 500 బోనస్ చెల్లించి అన్ని రకాల వడ్లను కొనాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు యెగోళపు శంకర్ గౌడ్, కౌన్సిలర్ కాయితి సమ్మయ్య, నాయకులు బత్తుల సత్యనారాయణ, ఎరుకల రవి, మాచిడి సత్యనారాయణ గౌడ్, పుప్పాల తిరుపతి లతోపాటు పలువురు పాల్గొన్నారు.
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *