సిరా న్యూస్,హైదరాబాద్;
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హోటల్ తాజ్ కృష్ణ లో ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడ రచన చేసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి ఎం.ఎం పల్లంరాజు, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్యే మదన్మోహన్ రావు, మాజీ డిజిపి సాంబశివరావు, క్వార్డ్ వైర్లెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సి.ఎస్.రావు, ఈ పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేసిన పూలదాసు నరసింహారావు, సంపాదకులు డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రచన చేసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి అనే పుస్తకం దేశంతో పాటు సమాజాన్ని మార్చి వేస్తుందన్న నమ్మకం ఉన్నది. ఆర్థిక అసమానతలు పెరగడం వల్ల సమాజానికి మంచిది కాదని ఇంక్లీజీవ్ గ్రోత్ బయట ఉన్న ప్రజలను ఇంక్లీజీవ్ గ్రోత్ లోకి తీసుకురావాలని ఈ పుస్తకంలో చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారుని అన్నారు.
సమాజ హితం కోసం వారు చేస్తున్న రచనలు చాలా స్ఫూర్తిదాయకం చైతన్యవంతమైనవి. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రజల ఆశలు ఆకాంక్షలు కలలు నెరవేరలేదని అన్నారు.
టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా నాకు స్ఫూర్తి దాయకులని అన్నారు.
మనందరి ప్రియతమ నాయకులు దివంగత ప్రధాని రాహుల్ గాంధీ ఈ దేశంలో టెలి కమ్యూనికేషన్ రంగాన్ని తీసుకువచ్చేందుకు అమెరికాలో ఉన్న శ్యామ్ పిట్రోడా మేధస్సును గుర్తించి అడ్వైజర్ గా సేవలు తీసుకున్నారు. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని చాలా దగ్గరగా తీసుకురావడానికి టెలి కమ్యూనికేషన్ ద్వారా భారీ విప్లవాన్ని శ్యామ్ పిట్రోడా తీసుకొచ్చారని అన్నారు.
అనుబంధ సంఘాల కమిటీలు వేయడానికి అమెరికాలోని 20 నగరాల్లో ఎన్ఆర్ఐ సెల్ కమిటీలు వేస్తున్న క్రమంలో చికాగో నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శ్యామ్ పిట్రోడా హాజరు కావడం, ఆరోజు ఆయనతో ఆ సమావేశంలో పాల్గొనడం నా జీవితంలో గొప్ప విషయంగా నిలిచిపోయిందని అన్నారు.