సిరా న్యూస్,వికారాబాద్ జిల్లా;
వికారాబాద్ మండల్ పులిమద్ది గ్రామ శివారులో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమయింది. గుర్తుతెలియని వ్యక్తులు పులిమద్ది గ్రామస్తుడైన శంకర్ కు చెందిన వ్యవసాయ పోలం మహిళను ఆమె ముఖంపై కొట్టి చీర కొంగుతో ఆమె మెడకు బిగించి చంపి పొలం ప్రక్కన కాలువలో వేసి గుర్తు పట్టకుండా శవం ను కాల్చి వేసారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి శరీరంపై ఆకుపచ్చ జాకెట్, పింక్ కలర్ పెట్ కోట్, గ్రీన్ కలర్ చీర దానిపై పసుపు,ఎరుపు రంగు పూలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.