సిరా న్యూస్,మేడ్చల్;
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ కు చెందిన రాజ్ కుమార్(21) అనే వ్యక్తి గత రెండు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి పంచశీల కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న కంపనీలో లేత్ మెషిన్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పంచశీల కాలనీ పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహకారంతో మృతుడిని రాజ్ కుమార్ గా గుర్తించారు. రాజ్ కుమార్ గొంతు పై, పొట్ట భాగంలో పదునైన ఆయుధంతో దాడి చేసి దుండగులు హత్యకు పాల్పడ్డారు, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ నరసింహ రాజు తెలిపారు.
=======================