మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ మంత్రులకు కొత్త శోభ వచ్చింది. మంత్రులు ప్రయాణించే వాహన కాన్వాయ్ లో అత్యాధునికమైన బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్ వాహనం చేరిపోయింది.ఇప్పటివరకు ముఖ్యమంత్రి కాన్వాయ్‌కే పరిమితమైన ఈ వాహనం ఇప్పుడు అందరి మంత్రుల కాన్వాయ్‌లో చేర్చారు. సుమారు రెండు కోట్ల వ్యయంతో అత్యాధునికమైన ల్యాండ్ క్రూయిజర్ల వాహనాలను ఈరోజు మంత్రుల కాన్వాయ్ లో చేర్చింది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్.గత బీఆర్ఎస్ ప్రభుత్వం 22 ల్యాండ్ క్రూయిజర్లను తయారు చేసి పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ వాహనాలన్నీ నలుపు రంగులో ఉండే విధంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటన్నిటిని రాష్ట్రానికి తెప్పించి ఆధునీకరించారు. ల్యాండ్ క్రూజర్ల అన్నింటినీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చి ప్రతి మంత్రికి ఒకటి ఇవ్వాలని నిర్ణయించారు.ఈ మేరకు జీఏడీ ప్రోటోకాల్ నేటి నుంచి ప్రతి మంత్రి కాన్వాయ్ లో ల్యాండ్ క్రూయిజర్ ను ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర మంత్రులు పరిపాలన వేగవంతం పెంచేందుకు ప్రజలకు వద్దకు,నియోజకవర్గం వెళ్లేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు మంత్రులు.కొత్త వాటిని కొనకుండా గత ప్రభుత్వం వెచ్చించిన వాహనాలనే వినియోగించుకుంటున్నామని ఆర్థిక క్రమశిక్షణతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *