సిరా న్యూస్,రంగారెడ్డి;
రాజేంద్రనగర్ పివిఎన్నార్ ఎక్స్ప్రెస్ వే కారు రేసింగ్ లో విషాదం మిగిలింది. రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చిన కారు పల్టీలు కొట్టింది. ధార్ కార్ పిల్లర్ నెంబర్ 296 వద్ద ఢీ వైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.ఘటనలో కారు లో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు మృతి చెందాడు. ప్రమాదంలో భారీ గా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమా? మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసారా? అనే కోణం లో దర్యాప్తు చేస్తున్నారు.