సిరా న్యూస్,మేడ్చల్;
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ గాగిల్లపూర్ తాండాకు చెందిన బిఆర్ఎస్ పార్టీ 27వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్ పై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది..వివరాలలోకి వెళితే గాగిల్లపూర్ తాండాకు చెందిన కొర్ర వసంత కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 157,158 లోని 5 గుంటల పట్టాభూమిని ఆక్రమించి ఓ నిర్మాణం చేపట్టడంతో బాదిత మహిళ పోలీస్ లను,మున్సిపల్ అధికారులను ఆశ్రయించింది,పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడన్న నెపంతో శంకర్ నాయక్,మోహన్ నాయక్,కొర్ర విజయ్ తదితరులు మహిళలను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడికి యత్నించాడంటూ దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీస్ లు కొర్ర శంకర్ నాయక్ మోహన్ నాయక్,విజయ్ నాయక్ లపై సెక్షన్ 323,506 రెడ్ విత్ 34 ప్రకారం కేసు నమోదు చేసినట్లు దుండిగల్ సిఐ సిహెచ్ శంకరయ్య తెలిపారు.