సిరా న్యూస్,భద్రాద్రి;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పని చేస్తున్న పొడిచేటి సీతారామచంద్ర చార్యులు పై కోడలిని సెక్సువల్ హారాష్మెంట్ చేస్తున్నాడని తాడేపల్లి గూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. మామ గారి వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు, ఆలయ ఈవో రమాదేవి మాట్లాడుతూ గా ఆలయంలో విధులకు సరిగా హాజరు కావడం లేదని అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని అన్నారు