సిరా న్యూస్,వెంకటగిరి;
నెల్లూరు జిల్లా వెంకటగిరి 14వ వార్డు పరిధిలోని పుల్లయ్యబడి వద్ద ఏడేళ్ల చిన్నారి హాసినిపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో హాసిని తీవ్రంగా గాయపడింది. వీధి కుక్కల దాడిలో ఏడేళ్ల చిన్నారి హాసిని తీవ్రగాయాలై ఆసుపత్రికి పాలైన ఘటన గురువారం తిరుపతి జిల్లా లోని వెంకటగిరి మున్సిపాలిటీ లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నరసింహరావు వీధికి చెందిన హాసిని గురువారం సాయంత్రంఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. హాసినిపై చేస్తున్న కుక్కల దాడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కుక్కలను తరిమేశారు. చిన్నారి హాసిని చేతులు, ముఖం పైకుక్కలు కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, అవి మనుషులపై గుంపులుగా దాడిచేస్తున్నాయని, కుక్కలబెడద నుంచి మమ్మల్ని కాపాడాలని మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య ని గ్రామస్థులు కోరుతున్నారు